ఆటవిక సమాజం

ఆటవిక సమాజం

పాలకి ఎడుస్తున్న
చంటి బిడ్డని
చంక కెత్తుకొని
భర్త కోసం నేను
పాల కోసం వీడు
ఎండిన కన్నీటి మీద
ఈగలు తోలుకుంటూ
ఎదురు చూస్తున్నాం…

చంటి బిడ్డ పాల కోసం
కడుపు మాడ్చుకుంటూ
కాళ్ళు ఈడ్చుకుంటూ
కన్నీళ్లు తుడుచుకుంటూ
వుద్యోగంకోసం వెతుకుతున్న
నిరుద్యోగిని నేను
దుర్మార్గులను చంపే వుద్యోగం
దేవుడు నాకిస్తే
ఎంత బాగుండు

పెళ్ళాం బిడ్డలతో
బ్రతుకు బండిని లాగుతూ
నేను ఒక్కడిని
ఎంతమందిని చంపగలను?

చంటి బిడ్డను
నమ్మి వచ్చిన ఆలిని
నట్టేట ఎలా ముంచగలను?

దుర్మార్గపు సింహాల నుంచి
రాజకీయ నక్కల నుంచి
ప్రసార మాధ్యమాల కాకుల నుంచి
ఆటవిక సమాజం నుంచి
మనిషికి రక్షణ లేదు

ఈ రోజుకి సాధుజీవిని
అవకాసం కోసం చూస్తున్న
చిరుతపులిని నేను
ఆకలిని, కోపాన్ని
దాచుకున్న
అగ్ని పర్వతాన్ని
యుద్ధం కోసం
సైన్యాన్ని సిద్ధం చేస్తున్న
సేనానిని నేను

చేయి చేయి కలుపుదాం
రామ రాజ్యం స్తాపిద్దాం
రావణులను చంపేద్దాం

-o-

దుర్మార్గులను మనిషి చంపితే పాపం.
రాముడు రావణుడిని చంపితే పుణ్య కార్యం.
ఈ సమస్యకు ప్రస్తుత సమాజంలో పరిష్కారం లేదు.
సిద్దాంతాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతానికి మళ్ళీ శ్రీ మాహావిష్ణువు మళ్ళీ జన్మించాలని కోరుకోవటం తప్ప
సామాన్య మానవుడు చేయగలిగింది ఏమీలేదు.
ఈ జీవితం ప్రస్తుతానికి ఇంతే.

Mar-23-2010, Atlanta, GA

Written after reading this poem ఇడుపుల వాసి తరాలు

Advertisements
 1. durga
  March 24, 2010 at 10:15 am

  Chala bagundi maastaru.

 2. madhavaraopabbaraju
  April 6, 2010 at 8:16 am

  శ్రీ భవానీ గారికి, నమస్కారములు.

  కవిత బాగుంది. అయితే, మొదటి పెరాలో “ఈగలు తోలుకుంటూ
  ఎదురు చూస్తున్నాం…” అని వ్రాశారు. దానినిబట్టి, భార్య మాట్లాడుతున్నట్లుగా తెలుస్తున్నది. కానీ, తరువాత పెరాలో , ” పెళ్ళాం బిడ్డలతో బ్రతుకు బండిని లాగుతూనేను ఒక్కడిని ” అని చెప్పటంతో , భర్త మాట్లాడుతున్నట్లుగా ఆయిపోయింది. అలాగే, ” రామ రాజ్యం స్తాపిద్దాం” అని ఆశిస్తూ, చివరి పెరాలో, ” ఈ సమస్యకు ప్రస్తుత సమాజంలో పరిష్కారం లేదు” అని ముగింపు ఇచ్చారు. ఈ రెండు భావనలు వైరుధ్యంగా వున్నాయి.

  భవదీయుడు,
  మాధవరావు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: