అదే వాన

అదే వాన

చల్లని వాతావరణం
కిటికీలోనుంచీ చూస్తున్నా
చిన్నగా వాన పడుతుంది

బడి నుంచి వస్తుంటే
చల్లని గాలి, వెచ్చని మట్టి,
చల్లని చినుకు, కమ్మని వాసన
చిన్నగా వాన ప్రారంభమైంది

వానలో తడుస్తూ వస్తున్నా
ఎక్కడ తడుస్తానో అని
అమ్మ నన్ను సంకకెత్తుకుంది
తన కొంగు కప్పింది
త్వర త్వరగా
ఇంటికి తీసుకు వచ్చింది

ఇల్లంతా కురుస్తుంది
మాయదారి వాన
అమ్మ తిడుతూ
ఇల్లంతా గిన్నెలు పెట్టింది
గిన్నెలలో నీళ్ళు
బయటికి పోస్తూ
ఎంత మంచి వానో అనుకున్నాను

వేడి వేడిగా ఏదైనా పెట్టవే
నాన్న కేక వేసారు
కుంపటిలో బొగ్గులు పేర్చి
తడచిన అగ్గిపెట్టెతో
కుస్తీలు పడుతుంది అమ్మ

చిన్న చిన్న
కాగితం పడవలు
నీళ్ళలో వదులుతూ
అన్నయ్యతో పోటీ పడ్డాను

వేడి వేడి మొక్క జొన్న పొత్తులు
అంటూ అమ్మ పిలిచింది
ఆత్రంగా ఆకులో చుట్టుకొని
ఒక మూల కూర్చొని
చలిలో, ఆకలితో
ఆబగా, ఆత్రంగా,
ఒక్కొక్క గింజా తింటుంటే
హాయిగా అనిపించింది

ఒకటేవాన
ఒకటి, రెండు
మూడు, నాలుగు
రోజులు గడుస్తూ వున్నాయి
వాన కురుస్తూ వుంది
కూరగాయలు అయిపోయాయి
వేడి వేడి అన్నం
ఎర్రని పచ్చడి
దేహాన్ని వెచ్చగా వుంచింది

వేసుకోవటానికి బట్టలులేవు
తడి బట్టలు ఆరలేదు
అంతా ముంజు కంపు
వాన మీద కోపమొచ్చింది

ఒక శుభోదయంలో
ఎర్రటి సూర్యుడు
నేనున్నానంటూ
నిదానంగా వచ్చాడు

హమ్మయ్య అని
గాలి పీల్చుకొనే లోపు
పక్కింటాయన వార్త తెచ్చాడు
మా వూళ్ళో ఎరుకి
మావైపు గండి పడిందని

వాన పోయి వరద వచ్చే
ఢాం ఢాం ఢాం అనుకుంటూ
సామానంతా సర్ది
అటక మీద పెట్టేసాం
జంతికల డబ్బా
బియ్యం, పప్పులు పట్టుకొని
పక్కింటి డాబా మీదకు చేరిపోయాం

వరద వుధృతం
ఒక రోజంతా వుంది
ఆరు బయట
డాబా మీద
వంటలు, వార్పులు
నవ్వులు, ఏడ్పులు
రాత్రంతా చలి
చాలీ చాలని బట్టలు
వుడికి వుడకని అన్నం
అతి కష్టం మీద
తెల్ల వారింది
వరద తగ్గింది
ఇల్లంతా మట్టి
కడుక్కోవటానికి
పది రోజులు పట్టింది

కమ్మని వాసనతో
మొదలైన వాన
మురుగు కంపుతో
వరదతో ముగిసింది

మనుషులను కలిపింది
మమతలను పెంచింది
ఏదీ శాశ్వతం కాదంటూ
పశువుల్ని, పొలాల్ని,
ఇళ్ళని, మనుషులని
తనతో తీసుకుపోయింది

కిటికీలోంచి చూస్తున్నా
అదే వాన, అలాగే కురుస్తుంది

దేశం దాటినా
కాలం మారినా
నేనున్నానంటూ
ప్రపంచమంతా కురుస్తుంది

చిన్న పిల్లలకు
కొత్త జ్ఞాపకాలు సృష్టిస్తుంది
పెద్ద వాళ్లకు
పాత జ్ఞాపకాలు గుర్తుకుతెస్తుంది

కాలంతో పాటు
వయసు మీద పడుతుంది
తను మాత్రం పొడుచుగా వున్నానంటూ
టప టపా పడుతుంది

-o-
Bhavani P Polimetla
Atlanta, USA
Sep-15-2009

Advertisements
 1. September 15, 2009 at 10:42 pm

  🙂 చాలా బాగుంది మీ అనుభవం.కవనం కూడా.

 2. kalpalatika
  September 15, 2009 at 11:35 pm

  CHALAA BAAGUNDANDI.
  CHADUVUTUNNANTASEPU NAA CHINNA TANAMAE GNYAPAKAMOCCHINDI [VARADA KAAKUNDAA].
  MANASUKI YENTOO AANANDAMGAVUNDI.
  CHAALA HAAYIGA ANIPINCHINDI 1ST HALF CHADUVUTUNNANTASEPU.

 3. bala
  September 17, 2009 at 7:35 am

  kundurti nagaramlo vaanala lotattu vaana daabaala muriki
  kadiginatlu anipinchindi. baagunnadi ooho hayigaa,kannillugaa. balametta

 4. Manju
  September 21, 2009 at 2:46 am

  hi andi,
  chala bavundi. eppativo gnapakalu gurtuku vastunnai chaduvutunte.
  meeru oka chinna village lo periginattunnaru kada.

 5. KK
  September 21, 2009 at 6:23 am

  Bhavani,

  Fentastic! Bhava Kavitwam chalaa baaga rasaaru!

  Last few lines adaragottaru bossoo!

 6. red jhon
  September 23, 2009 at 7:37 pm

  భవాని గారు
  నాకు మెయిల్ ద్వారా కవితలు పంపినందులకు ధన్యవాదములు. “అదే వాన” కవిత ఒక ధారాగ చక్కగా సాగింది. అందులో భావం వుంది, జీవితం వుంది, నీతి వుంది.

 7. KP
  September 24, 2009 at 9:58 am

  Baavundi Bhavani

 8. mercy
  January 5, 2012 at 1:51 pm

  really beautiful shared the same on https://www.facebook.com/profile.php?id=100003061635127
  noo words …

 9. Dr Gnaneshwar Chidella
  September 23, 2016 at 11:04 pm

  Hello Bavant garu
  Really liked ur BHAVAKAVITHWAM…
  It’s virtually every ones experience. . Would like to subscribe more of ur works
  All the best for ur future works…
  Keep going

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: