అమెరికా సుడిగుండాలు

అవకాశం ఆశావాదం
వున్న చోట వుద్యోగం లేదని
పక్కింటి వాడు వెళ్ళాడని
ఎదిరింటి వాడు వెళ్ళాడని
వెళ్ళిన వాళ్ళు సుఖపడ్డారని
దండిగా డబ్బులు పంపిస్తారని
అప్పులు చేసి, వీసాలు తెచ్చి
కన్నవారు, కట్టుకున్నవారు
అమెరికా సుడిగుండంలోకి తోసేసారు
మరికొందరు తామే దూకేశారు

భోగి మంటల అనుభవాన్ని
campfire లో వెతుకున్నారు
దీపావళి పండగని
july 4న గుర్తుకు తెచ్చుకున్నారు
కొబ్బరి బొండం దొరికినా
కొనలేమని ఊరుకున్నారు
చెరుకు రసం కోసం
మైళ్ళకు మైళ్ళు ప్రయాణం చేశారు
సుఖపడుతున్నాం అనుకుంటూ
రాజీ పడటం నేర్చుకుంటున్నారు

బట్టలు వుతుక్కునారు
ఇస్త్రి చేసుకున్నారు
ఇల్లు తుడుచుకున్నారు
అన్ని పనులు తామే చేసుకుంటూ
డాలరు డాలరు దాచుకున్నారు
గొప్పల కోసం, దర్పం కోసం
దాచుకున్న డబ్బులు
ఖరీదైన ఫోన్లకి, కారులకు తగలేశారు
Credit Cards కట్టలేక
కళ్ళు తేలేసారు

Insurance కొనుక్కోకుండా
తమ కేమి కాదంటూ బ్రతికేసారు
ప్రమాదంలో పోయినప్పుడు
తెలుగు సంఘాలలో
డాలర్ల కోసం అడుకున్నారు
ఆంధ్ర రాష్ట్రం NRI లకు
సహాయం చెయ్యాలంటూ
TV Channels లో బావురుమన్నారు

మిలియనీర్ అవ్వాలంటూ
పెళ్ళాలను ఉద్యోగాల్లో పెట్టేసారు
ఏడుస్తున్న పిల్లలను
పూటకూళ్ళ ఇళ్ళలో వదిలేసారు
ప్రమోషన్ల కోసం పార్టీలకు వెళ్ళారు
పూటుగా తాగి డబ్బు కోసం
మొగుడూ పెళ్ళాలు
తన్నుకు చస్తున్నారు

అమ్మకి ఆదివారం శెలవు
అందుకే ఆరోజు కన్నదని
చిన్నపిల్లలు ఆనందపడి పోతున్నారు
పండుగలు, పుట్టిన రోజులు
పెళ్లి రోజులు, శుభకార్యాలు
శెలవు తీసుకునే ధైర్యం లేక
శని ఆది వారాలలో కానిచ్చేస్తున్నారు

Fundraise ఆంటూ
పరుగెడుతున్నారు
సాంస్కృతిక కార్యక్రమం అంటూ
క్లబ్బు డాన్సర్ తో
చిందేస్తున్నారు
పక్కింటి వాడి పెళ్ళాం తో
కలసి ఆడేస్తున్నారు
Potluck అంటూ
పందుల్లా తింటున్నారు
బొజ్జలు బాగా పెంచి
బ్రేవ్ మంటున్నారు

అమెరికా పంపిచేటప్పుడు
అమాయకంగా అనుకుంటారు
కన్నవాళ్ళు అప్పుడప్పుడు
వచ్చి పోతుంటారు అని
అనుభవం మీద తెలుస్తుంది
వాళ్ళు పెళ్లిళ్లకు, చావులకు
మాత్రామే వస్తారని
అమెరికా వెళ్ళక
పిండాలు, తద్దినాలు కూడా పెట్టరని
ఆస్తుల కోసం తన్నుకుంటారని

మొహం వ్యామోహం
పుష్కలంగా వుండే
అమెరికా సుడిగుండంలోకి
తెలిసి దూకినవాడు
తిరుగుతూ వున్నాడు
తెలియక దూకిన వాడు
బయటపడి బావురుమన్నాడు
తిరిగిరాని కాలం
శీలం యవ్వనం కోసం
చనిపోయిన అమ్మా నాన్న కోసం
-0-

Bhavani P Polimetla
Cupertino, CA, USA
13-Jan-2014

Advertisements
 1. Murali Krishna
  January 13, 2014 at 5:38 pm

  Ammaki aadivaram selavu anduke aa roju kannadi ….. 🙂

 2. madhavi
  January 14, 2014 at 8:28 am

  Thought provoking

 3. Yedukondalukatiki
  January 14, 2014 at 12:08 pm

  Bhavani,
  You have our life on the paper with true picture. Very touching.

  Thanks
  Yedukondalu

 4. Mahesh
  January 14, 2014 at 6:57 pm

  Good one

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: