Amma

అమ్మ

చల్లని చూపు
చక్కటి పిలుపు
చిక్కటి ప్రేమ
ఛీ పొమ్మన్నా
అక్కరకు చేర్చుకుంటుంది

వెచ్చని స్నానం
వేడి వేడి అన్నం
వడపప్పు పాయసం
వద్దు అన్నా వడ్డిస్తుంది

బరువు, భాద్యత
భారంగా అనిపిస్తున్నా
భరిస్తూ వస్తుంది
బిడ్డ భవిష్యత్తుకోసం

కడుపు మాడుతున్నా
కళ్ళతో ఎదురు చూస్తుంది
కలలతో సాగిపోతుంది
కన్నవాడికోసం
కడవరకు నిలిచిపోతుంది

అమ్మమ్మ, నాయనమ్మ
అమ్మ, అత్త
అక్క, వదిన
భార్య, బిడ్డా
వరస ఏదైనా
అందరూ అమ్మలే

మంచిని కోరుకుంటారు
ప్రేమను పంచి పెడతారు
తాము సమిధలై
పది మందికి దారి చూపిస్తారు
తాము పరిగెడుతూ
ప్రపంచాన్ని నడిపిస్తారు

ఏమి ఆశించని
అమ్మకు ఏమి యివ్వగలం?
దేవుడు లేని లోటు
అమ్మ తీరుస్తుంది
దేవుడు దీవించకపోయినా
అమ్మ ఆశ్వీర్వదిస్తుంది
భర్తను బ్రతిమలాడి
బిడ్డను వినాయకుణ్ణి చేస్తుంది
అమ్మ పాదాలకు
అశ్రువులతో వందనం
పాదాభి వందనం
నువ్వు ఇచ్చిన
ఈ జీవితం నీకే అంకితం
-o-
Bhavani P Polimetla
Date: May-13-2017
Mothers Day,
Austin, Texas.

Advertisements
%d bloggers like this: