అన్య కుల కన్య

అన్య కుల కన్య


అందమైనా రమణిని
కన్నులార్పక చూడగ
చూసి చూసి కనులు
కాలమును మరిచె

చిరు నవ్వు మోమును
చూసినా నా మనసు
నన్ను కాదని
నా కులమునూ మరచి
ఆ రమణి తోడనే
ఊయలలు వూగె

అది చూసి మా నాన్న
నే చచ్చినంతా ఒట్టని
నన్ను కర్ర తో కొడితే
మనసు లేని తనువుకి
ప్రాణముండీ లాభామేమని
నా కంట కన్నీరు
చిలికి చిలికీ
వాన వరదలై పారే

అన్య కుల కన్యనచు
మన కొద్దు పొమ్మనుచు
మా నాన్న పోరితే
మనసు తోనే మనువని నేను
మనసు లేని తనువుకే
మంగళ వాద్యాలనచు నాన్న
పోరి పోరి అలసితిమి
సంధి మార్గములేక

అలసినా నా మనసు
రమణి వద్దకు చేరె
సొలసినా మా నాన్న
అమ్మ వద్దకు చేరె

ఏ జన్మ పాపమో
ఈ రణమునా నిల్చితి
పగవానికీ వద్దు
ఒక్క క్షణమును కూడ

-o-

Date: Jul-22-2009
Atlanta, GA, USA

Advertisements
 1. Balakrishna
  July 22, 2009 at 1:59 pm

  chaala baagundi. kulaantara premikulu manasulo pade vedanani kallaki kattinatlu cheppaaru. mee prayatnam abhinandaneeyam…

 2. July 22, 2009 at 2:05 pm

  🙂

  నాన్న సంగతి సరే!
  అందాల అతివకూ
  అన్నలెవరూ లేర?
  అమ్మ-నాన్నా లేర?

  అందమైనా రమణి
  అంత సులువన్నార?
  ఆటంకములు యేవి
  అటు వైపు లేవా?!!

  • polimetla
   July 22, 2009 at 3:56 pm

   అందాల రమణికి
   అన్నీ కష్టాలే
   ఆమె బదులు అతనిని
   అతని బదులు ఆమెని
   మార్చి చదువుకుంటే

 3. Swathi
  July 22, 2009 at 9:07 pm

  Chaala baagundi prema katha. Keep them coming.

 4. Murali Krishna
  July 22, 2009 at 9:15 pm

  Wow Anna, chala baagundi …

 5. వల్లూరి సుధాకర్
  July 23, 2009 at 11:13 am

  బాగుందండి మీ వేదనాభరిత కవిత. మరి కథ సుఖాంతమేప్పుడో.

  • polimetla
   July 23, 2009 at 2:52 pm

   ఆ దేవుడు దిగి వచ్చి
   మా నాన్నను ఒప్పిస్తే
   మా ఇంట్లో కల్యాణం
   మీ అందరికీ విందు భోజనం

 6. Sree
  July 23, 2009 at 8:31 pm

  Chala Bagundi—- Chakkani title kuda….

 7. mahesh
  July 26, 2009 at 4:09 pm

  Its super!!! Eager to read any updates from your blog.
  As everything conveys some good meaning.

  I wish you update it frequently.

  Thanks
  mahesh

 8. shobha
  July 28, 2009 at 5:28 am

  నమస్తే,
  భవానీ గారు.
  మీ కవితలన్నీ మనసుకు హత్తుకొనేలా చదివిన వాళ్లు ఒక్క నిముషమైన జీవితం గురించి ఆలోచించేలా
  మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా వున్నాయి. మీ “లెక్కలేని జీవితం “, “నా జీవితం” , “అన్య కుల కన్య “, “మద్య తరగతి జీవితం ” ఒకటేంటి అన్ని కవితలు చాలా బాగున్నాయి. మా లాంటి చిన్న చిన్న సాహితీ ప్రియులకు మీ కవితలు మార్గదర్స్యకాలు. ప్రతి కవితలో ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ వ్రాసిన మీ శైలి భావ ప్రకటన బాగుంది. ఇంత మంచి కవితలు మాకు అందచేస్తున్నందుకు మా నెనర్లు…

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: