చిట్టి పాప


చిట్టి పాప
చిన్నారి పాప
అమ్మ కళ్ళలోకి
ఆశగా చూస్తుంది
నాన్నకళ్ళలోకి
నవ్వుతూ చూస్తుంది
ఊసులెన్నో చెపుతుంది
చిరునవ్వులు చిందిస్తుంది
బొజ్జలో ఆకలికి
ఉగ్గపట్టి ఏడుస్తుంది
బుజ్జగిచ్చి పాలిస్తే
హాయిగా బొజ్జుంది


బొజ్జున్న పాపయిని
బుట్టలో పెట్టారు
పాల డబ్బాలు
గుడ్డ గోచీలు
బొమ్మలు, బిళ్ళలు
అన్నీ సర్ది
మామ్మ తాతలతో
విమానం ఎక్కించేసారు

ముద్దు ముచట్లు
మనసులో తలుచుకుంటూ
కన్నీటిని కప్పిపుచ్చి
కారులో సాగిపోయారు

తూరుపు దిక్కున
తెల్లారిన వెంటనే
ఫ్రిజెలోని సద్ది కూడు
డబ్బాలో సర్దుకుని
పొడర్లు అద్దుకొని
అత్తరులు పూసుకుని
సెల్ ఫోను చేత పట్టి
రాబోయే కాలానికి
కావాలోయ్ ధనం అంటూ
విలాసంగా కార్యాలయానికి
ఊపుకుంటూ వెళ్ళిపోయారు

పాపాయికి ఫోన్ చేస్తారు
హలో హలో అనేస్తారు
ఆ రోజుకి కాన్ఫరెన్స్ కాల్
అయిపోయిందని సంబరిపడిపోతారు

ఫోనులో హలో హలో అర్ధంకాక
కెవ్వుమంది చిట్టి తల్లి
అమ్మ, నాన్న అని
సర్ది చెప్పేశారు ముసలోళ్ళు

కని పారేసిన కసాయి వాళ్ళకి
అవుట్ సోర్సింగ్ కి ఇచ్చేసిన అమ్మా నాన్నకి
తేడా తెలియక
అమాయకంగా అలసిపోయి
బొజ్జుంది చిట్టి పాపాయి

కుక్క, కోడి
ఆవు, గేద
కాకి, పిట్ట
అన్ని జీవులు
పిల్లలని చక్కగా సాకుతుంటాయి
అవుట్ సోర్సింగ్ కి
ఇచ్చేసిన అమ్మా బాబు మాత్రం
తామేదో ఘనకార్యం చేసినట్టు
సంబరపడిపోతున్నారు

బరువయిన బంగారం మొయ్యలేక
ఫోనులో రోజు హలో హలో అనలేక
ఆమ్మా బాబు వున్నా
అనాధ జీవితాన్ని
అమాయకంగా గడిపేస్తుంది
బోసినవ్వుల చిట్టి తల్లి

-o-

-o-
Bhavani Polimetla
Dunwoody, GA
Jul-23-2012

Image Source: http://commons.wikimedia.org/wiki/File:Baby_carrying_Tamil_Nadu_state,_India_1.jpg

Advertisements
 1. July 24, 2012 at 2:55 pm

  There are few exceptions…like parents with illness, medical problems…but I know many parents who send kids to India to save money on day care and others.

 2. Murali Krishna
  July 24, 2012 at 9:33 pm

  Its superb… touching ….

 3. Kranthi Madineni
  July 25, 2012 at 2:24 pm

  This is so true…I believe there are exceptions like you said. Even then, when you look back and see those days are gone and you never get back to really see all those they do each month and to enjoy with your lil one. I still miss those days when I had to send my lil one due to medical problems!! 😦

 4. Mahesh
  July 31, 2012 at 5:12 am

  very true and excellent!!! Hats off to you for your daring to express this in a very touching way!!! Thank you for sharing and hopefully some parents should realize and what exactly they are missing. For the sake of tomorrow which is not guaranted any way how they are missing/sacrificing today …

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: