జీవితమే ఆనందం (పాట)

జీవితమే ఆనందం (పాట)

సీతాకోకా చిలుకల్లారా
చిగురిస్తున్నా ఆకుల్లారా
చిట్టి పొట్టి పూవుల్లారా
జిలుగు జిలుగులా మిణుగురులారా
మీరంతా తోడుంటే
ఆనందంతో ఆడెదము, ఆడెదము

కొమ్మచాటూ కోయిల్లారా
చిట్టి పొట్టి పిందెల్లారా
తీయగ కాసే చెట్టుల్లారా
జల జల పారే కాలవలారా
కాలవలోని చేపల్లారా
మీరంతా తోడుంటే
రోజంతా ఆనందం, ఆనందం

కువ కువ లాడే పక్షుల్లారా
ఆకాశంలో మబ్బుల్లారా
మబ్బుల్లోని మెరుపుల్లారా
దద్దరిల్లే వురుముల్లారా
చిట పట లాడే చినుకుల్లారా
మీరంతా తోడుంటే
నాకంతో ఆనందం, ఆనందం

-o-
Bhavani P Polimetla
Atlanta, USA
Sep-14-2009

Advertisements
 1. September 20, 2009 at 8:32 pm

  చిన్న పిల్లలకు మంచి రైం గా బాగుంది. ఆన్లైన్లో చందమామ వస్తుంది. పంపిస్తే బాగుంటుంది. రాజశేఖర్ గారు పనిచేస్తున్నారు. ఇలా చొరవ తీసుకొని సలహా ఇచ్చిన౦దుకు ఏమి అనుకోరుగా? ఎక్కువ పాపులర్ అవుతుందనే. krajasekhara@gmail.com

 2. September 20, 2009 at 11:39 pm

  చాలా బాగుంది, భవాని గారు మీ విశ్లేషణ,
  మీ కవితల కవ్వింపులు తోడుంటే,
  నిజంగా ఆనందం , ఆనందం
  కాని

  కొమ్మచాటూ కోయిల్లారా
  చిట్టి పొట్టి పిందెల్లారా
  తీయగ కాసే చెట్టుల్లారా
  జల జల పారే కాలవలారా
  కాలవలోని చేపల్లారా
  మీరంతా తోడుంటే
  రోజంతా ఆనందం, ఆనందం

  “తియ్యగ కాసే చెట్టుల్లారా”,
  అనేది సరైన వాఖ్యం కాదేమో అని అనిపిచ్చింది, క్షమించాలి ఎమన్న తప్పుగా మాట్లాడితే, అది నా అభిప్రాయం మాత్రమే.

 3. bala
  September 22, 2009 at 12:42 pm

  kavitvam ante rachana kaadu. idi kevalam vachana rachana. eminaa mahakavulu saitam anni velalaa
  manchi kavitvam velainchaleru.bala

 4. red jhon
  September 23, 2009 at 8:00 pm

  బాగుంది. కాని చరణాలలో విషయాలు repeation లాగ అనిపిస్తాయి. మొదటి చరణం లో ఆకులు, పువ్వులు, అన్నారు. రెండవ చరణంలో పిందెలు, చెట్లు అన్నారు.
  ఇవన్నీ కూడ చెట్టుకు సంబందించినవే.

  కావున ప్రతి చరణం ఒక విషయం పైననే చెప్పగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఊద: మొదటి చరణంలో సీతాకొక చిలుకలు, పంచదార చిలకలు, మిణుగురులు, కోయిలలు, నెమలులు వ్రాసి, రెండవ చరణంలో చెట్టుకు సంబంధించిన విషయాలతో వ్రాస్తే బాగుంటుందేమో. అవిధంగా భవం repeation వుండదు.

  మరియు మూడవ చరణంలో మబ్బులు, మెరుపులు, ఉరుములు ఆనందం కలుగజేస్తాయని వ్రాశారు. అది కవితా సమయానికి విరుద్ధమని నా భావన. ఏందుకంటే అవి భయాన్ని కలుగ జేస్తాయి గాని ఆనందాన్నివ్వవు.

  దానికి బదులు ఆకాశంలో చుక్కలు, జాబిలి, సంధ్య సమయం గురించి వ్రాయవచ్చేమో.

  ఇది విమర్శ కాదు కేవలం నా అభిప్రాయాలు.

 5. KP
  September 24, 2009 at 10:02 am

  Eee patani paadi choosanu. paatalo rhythm vundi. Speed rhythamlo padavalenanukunta.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: