కోడలు ఏకాదశ గ్రహం

కోడలు ఏకాదశ గ్రహం

అందమైన, ఆనందమైన,
ఆరోగ్యమైన, జ్ఞాని అయిన,
బ్రమ్హచారి అయి, పని చేయుచున్న
అభివృదిలోని పుత్రునుకి
ఆనందము మరింత పెంచ వలెనని
వంశం అభివృధి చెందవలెనని
పాడి పంటలు సంవృధి చెందవలెనని
ఊరంతా వెదికి వెదికి
చివరకు ఒక కన్యను కోడలిగా తెచ్చిరి

పెళ్ళైన మరుదినము నుండి
ఏకాదశ గ్రహ ప్రభావము
దిన దిన ప్రవర్ధమానమయ్యే

మొగుడి అందము కంటే
వాని స్నేహితులు సుందరాంగులు అని
మొగుడి జీతము కంటే
తండ్రి ఆస్తి యే ఉత్తమ మని
కొత్త కోడలు తలచె

ఉదయము అయినంతనే
కాఫీ ఇవ్వని అత్తగారి కంటే
పని మనిషే వుత్తమమనెను

చదువుటకు దిన పత్రిక లేదని
మామ గారిని దెప్పి పొడిచే
దూర దర్శిని చూచుటకు
మరదలు అడ్డు అని తిట్టి పోసె

తాను ఏకాదశ గ్రహ మని మరచి
వూరందరికి తన భర్త
దశమ గ్రహమని చాటి చెప్పె

-o-

ఒక సుభ దినమున
భర్తను బుట్టలోన పెట్టి
వేరు కాపురంబు వెలగపెట్టె

సంపాదన తనకు అనుచు
కని పెంచిన అత్త మామను
కానలకు పంపె

భర్త తరుపు బందువులందరు
గుది బండలనుచు
సంభ౦దములన్ని త్రుంచి వేసె

కన్న బిడ్డలకు
పుట్టింటి వారు దేవతలని
అత్తింటివారు రాక్షసులని
మదినందు నూరి పోసె

గ్రహములన్నియు చేరి
తనకు భజన చేయవలెనని
లేకుంటే వారిపై గృహ హింసా
కేసులనచు భయ బ్రాన్తులను జేసె

ఈ రకముగ ఏకాదశ గ్రహము
సృష్టినంతా ఎలుచుండె

-o-

సృష్టి నందు ఏకాదశ గ్రహము
లను చూచి, బ్రమ్హ విష్ణు మహేశ్వరులు
ఏకాదశ గ్రహము కంటే
దశమ గ్రహము ఒక అంకె తక్కువని
దశమ గ్రహముల చే తృప్తి నొందె

-o-

మంచి అల్లుళ్ళు వున్నారు. మంచి కోడళ్ళు వున్నారు.

ఐనను

ఏకాదశ గ్రహ ప్రచార మందు,
దశమ గ్రహ ప్రభావము
దిగదుడుపని లోకమునందు
అందరకు కానవచ్చే

-o-

http://jyothivalaboju.blogspot.com/2010/05/blog-post_19.html
జామాత దశమగ్రహ:
ఈ వ్యాసానికి సమాధానమే ఈ కవిత
-o-

అచ్చు తప్పులు క్షమించగలరు

Advertisements
 1. raja
  May 20, 2010 at 12:23 am

  mee kavitha lo lenivi inka chalane unnayi lendi
  good counter attack

 2. raja
  May 20, 2010 at 12:25 am

  mee kavitha lo lenivi inka chalane unnayi lendi
  good counter attack

  akkada comment pettadam waste (nachindaitene approval kada) ani ikkada comment pedutunnanu

 3. May 20, 2010 at 1:07 am

  భవాని గారు ,
  ఐతే మీరు కోడలి గురించి రీసర్చ్ చేసారన్నమాట !
  నేను అతివల బ్లాగస్ వెతికినప్పుడు , నాకు కంటి కి చిక్కకుండా తప్పించుకున్నారే ! పరవాలేదు లెండి , ఇప్పుడు ఇక్కడ మిమ్మలిని కలిపేసాను .

  http://sahiti-mala.blogspot.com/2010/05/blog-post_05.html

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: