కృష్ణాష్టమి

కృష్ణాష్టమి

చిన్ని కృష్ణుడు
చిన్నారి కృష్ణుడు
ముద్దు లొలికించు
మురిపాల కృష్ణుడు

కృష్ణాష్టమి రోజు
కృష్ణులందరు చేరి
వీక్షించు వారిని రంజింపచేయ
అసలు కృష్ణుడే వచ్చిన
మనసెంత సంతసించునో
వర్ణింప అలవికాదు

గోకులమున ఆవులకు గడ్డి లేదు
పొలమునా రైతునకు నీరు లేదు
ఏ పాలు తెచ్చి పాయసము వండెదము?
మురిపాలతో నీవు సర్దుకొనుము

జనులను మరిపించి, మోసగించు
రాజకీయ కృష్ణులు,
రోగముతో వచ్చు జనులకు
వుత్తుత్తి బిళ్ళలిచ్చు
వైద్య నారాయణులు,
ధనము పోయిందని
ధరకాస్తు ఇస్తే
అసలు దొంగను వదలి
మమ్ము చరసాలలో బంధించు
కంస రాక్షసులు ఎక్కువైనారు

త్వర త్వరగ రావయ్య
అసలు కృష్ణయ్య
దొంగలను, దొంగ కృష్ణులను
తరిమి కొట్టంగ రావయ్య

త్వర త్వరగ రావయ్య
మామంచి కృష్ణయ్య
పాడి పంటలు ఒసగు
మంచి మనసులను ఒసగు
నేర్పు, ఓర్పులను ఒసగు

త్వర త్వరగ రావయ్య
మనసైన కృష్ణయ్య
మా తప్పు మన్నించి
మా ఇంట వుండాలి
విందారగించాలి
మా మనసుతోడనే
ప్రతి క్షణము వుండాలి.

-o-

Bhavani P Polimetla
Atlanta, USA
Aug-17-2009

Advertisements
 1. Tak
  August 18, 2009 at 8:47 am

  Kavitha Chaala baagundi..

 2. Krishna Prasad
  August 27, 2009 at 5:06 am

  Bhavani,

  Krishna told in Gita that when Adharma reaches its peak, then I will come.
  Your poem is remindign Krishna about his promise :).

  Love
  KP

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: