మధ్యతరగతి జీవితం

మధ్యతరగతి జీవితం


ఈ జీవితం వడ్డించిన విస్తరి అనుకున్నా
తినబోతూ తరచి తరచి చూస్తున్నా

పెళ్ళికి ముందు అందమైన కలలు
మొదటి రాత్రి అయ్యాక తెలిసింది
చీకటిలో ఏమి కనపడవని
ఇది తెలియని కొందరు
పెళ్లి చూపులంటూ
సంవత్సరాలు గడిపేస్తున్నారు

అందమైన అమ్మాయిలు (అబ్బాయిలు)
బొమ్మలలో కవ్విస్తారు
నిజ జీవితంలో
కలలో మాత్రమే కనిపిస్తారు

పెద్ద కారు కొందామనుకున్నా
ఖర్చులు తట్టుకోలేమని
బుల్లి కారుతో సరిపెట్టుకొన్నా

సొంత ఇల్లు కొందామనుకున్నా
వడ్డీలు కట్టలేక
అద్దె ఇంట్లో సర్దుకుపోతు

హోటల్ కి వెళ్లి కడుపునిండా తిందామనుకున్నా
రాబోయే కడుపు నెప్పి తలచుకొని
బుద్దిగా భోజనం వండుకు తిన్నా

పద్యం, గద్యం రాయాలని
పాటలు, గేయాలు పాడాలని
అందమైన బొమ్మలు గీయాలని
ప్రకృతినంతా చిత్రించాలని
ప్రపంచమంతా మొక్కలు నాటాలని
భాష కోసం పాటుపడాలని
జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదగాలని
ఎన్నో ఆశలు, ఆశయాలు

ఆలోచనలు, అనుభవం,
తర్కం, తత్త్వం,
మధ్యతరగతి జీవితం
నన్ను కట్టిపడేసాయి

మధ్య తరగతి జీవితం
గానుగ ఎద్దు జీవితం
అన్నీ కనపడుతుంటాయి
చుట్టూ నడవటమే తప్ప
అన్నీ అందని ద్రాక్షలే అవుతాయి

భుక్తి కోసం, బొంది కోసం,
మానిటర్ పై చూపులు
ఎలుకపిల్ల తో పిల్లి మొగ్గలు
కీ బోర్డు తో కుస్తీలు

ఈ జీవితం తీరని దాహం,
ఈ రోజు ఇంతటితో సమాప్తం.

-0-
Bhavani P Polimetla
Atlanta, GA
Date: Jul-27-2009

Advertisements
 1. July 7, 2010 at 5:48 am

  pelliki mundhu edhalo enno ennenno,pelliyyaka telustundhi asalu jivitham,chaala baaga chepparu.

 2. May 16, 2012 at 7:30 am

  చాలా బాగుంది

 3. SRUTHI
  May 11, 2013 at 8:37 am

  CHALA BAGUNDI …NIJAM GA MADHYA THARAGATHI VALLALO CHALA KNOWLEDGE UNTUNDI ..PApam pedarikam addu ga untundi ..na drustilo ami leni vadu peda vadu kadu anni unna ami cheyleni vadu pedavadu…..

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: