నా దేవుడు

పాపాత్ములకి ఐశ్వర్యాన్ని
పుణ్యాత్ములకి దరిద్రాన్ని ప్రసాదిస్తాడు

కళ్ళు ఉన్నవాడికి కనపడడు
కళ్ళు లేనివాడికి ఎదురుగా ఉంటాడు

అడిగేవాడు ఇచ్చేవాడికి (దేవుడికి) లోకువ
ఇచ్చినా, పుచ్చుకున్నది శాస్వతం కాదు
ఇవ్వకపోయినా, నష్టపోయింది ఏమి లేదు

అద్దంలో ప్రతిబింబంలా కనపడతాడు
అవునంటే కాదంటాడు
కాదంటే అవునంటాడు
అర్ధం అయినట్లు ఉంటాడు
ఎప్పటికి అర్ధం కాడు

బేతాళుడిలా ప్రశ్నలు అడుగుతుంటాడు
సమాధానం చెప్పినా సతాయిస్తాడు
చెప్పకపోయినా సతాయిస్తాడు

నా జీవితాన్ని
నన్ను బ్రతకనివ్వడు
వాడు సుఖ పడడు
నన్ను సుఖ పడనియ్యడు
వాడే నా దేవుడు

నన్ను కన్న దేవుడు
నా పాలిట యముడు
నా లోపలే ఉంటూ
నవ్వి పోతుంటాడు
కష్టాలలో సుఖాలలో
నన్నూ నవ్విస్తుంటాడు

-o-
Bhavani P Polimetla
09-20-2012, San Bruno, CA

Advertisements
 1. Shyam
  September 20, 2012 at 5:32 pm

  Good one Bhavani … Opening lines are nice …

 2. Yedukondalu
  September 20, 2012 at 6:43 pm

  Perfect definition of Demudu. Very good one Bhavani!

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: