నా జీవితం 2012


అరిగిన చెప్పులు
చిరిగిన చొక్కా
కాలే కడుపు
బ్రేకుల్లేని సైకిలు
దయకల గురువు
కష్టపడి చదివితే
చివరకు వచ్చింది
డిగ్రీ పట్టా

డొక్కు పెట్టె
రెండు జతల బట్టలు
చిరిగిన దుప్పటి
ఎర్ర బస్సు ప్రయాణం
బెంగళూరు చేరింది
అలసిపోయిన శరీరం

రూపాయి ఫోన్లు
అర్ధరూపాయి xerox
కాళ్ళు పట్టుకుంటే
చివరికి చిక్కింది
చక్కని వుద్యోగం

రాత్రి పగలు
కంప్యూటర్ తో కుస్తీలు
కుళ్ళు రాజకీయాలు
తట్టుకొని నిలబడితే
వచ్చింది చాన్సు

మద్రాసు ప్రయాణం
డిగ్రీ పట్టా
అనుభవ పత్రాలు
ఇవే నా ఆస్తులు
తెల్లవారు జామున
మురుగు కాలువ పక్క
ఆరుగంటలు నిరీక్షిస్తే
అమెరికా కాన్సులేటు
తెల్ల దొరగారు
తలుపులు తెరిచారు
చూసి వచ్చెయ్యమని
అచ్చు గుద్దారు

రూపాయి పెట్టి
పాలిషు కొన్నా
పప్పులు ఉప్పులు
పచ్చడులు పొడులు
అన్నీ సర్దుకొని
వున్న వూరు వదులుకొని
కన్నవారిని కాదనుకొని
కానరాని తీరాలకు
కన్నీటితో సాగిపోయా

న్యూయార్క్ నుంచి
కాలిఫోర్నియా వరకు
పొట్ట చేత పట్టుకొని
కూలిపని చేసుకున్నా

మావూళ్లో రైసుమిల్లర్లకు
అమెరికాలో ప్రైంవెండర్లకు
తేడా లేదని తెలుసుకున్నా

చదువు సామర్ద్యం వున్నా
దళారి చేతిలో మోసపోతున్నా

ప్రతి ప్రాజెక్ట్ లో లంచగొండితనం
మావూళ్లో జలయజ్ఞానికి
మా ఆఫీసులో ప్రాజెక్టుకి
తేడా లేదని తెలుసుకున్నా

అన్యాయం చూడలేక
ఎదురు తిరిగి మాట్లాడలేక
ప్రతీ వూళ్ళో చాప చుట్టేస్తున్నా


ఉద్యోగంలో అడుగు పెట్టాక
తీగ పై నడవమంటారు
పడిపోతే పంపించేస్తారు
పడకపోతే తప్పట్లు కొడతారు
డాలారో డైమో
మొఖాన పడేస్తారు
పల్లెటూరు నుంచి
పట్నం వచ్చినా
నా దొమ్మరి జీవితం ఇంతే
కడవరకు నడవక తప్పదు
కన్నీటితో సాగక తప్పదు

-o-

Bhavani P Polimetla
May-04-2012
Dunwoody, GA, USA

-o-

Image Courtesy: http://www.myspace.com/7480695/photos/63047071

Advertisements
 1. Aleen K
  May 5, 2012 at 9:42 pm

  Brilliant !! 🙂

 2. Balakrishna
  May 6, 2012 at 9:44 am

  చాల అద్భుతం గ ఉంది భావాని గారు. సగటు IT వాడి జీవితం కళ్ళకు కట్టారు. సమస్య ని ఆవిష్కరించారు. దీనికేమైనా పరిష్కారం దొరికితే మరో కవిత లో తెలియ చేయకలరు. మూట ముళ్ళు సర్దుకొని మాతృభూమి కి చేక్కేయ్యటం ఒక పరిష్కారం అనుకుంటున్నా. ఏమంటారు?

 3. Murali Polimetla
  May 7, 2012 at 7:45 am

  Hi Anna, chaala baagundi ….. I do agree with Mr. Balakrishna…. parishkaram tho maro kavitha ki srikaram chuttu…

 4. Shyam M
  May 7, 2012 at 2:31 pm

  Good Poem Bhavani … Prime Vendor is balancing the contracting system, everything is tightly aligned within the system around prime vendor.
  Prime Vendor ki nuvvu kaavali and client kuda kaavali.
  Client ki Prime Vendor ee kavali, nuvvu kaaka pothe inkokadu.
  Neeku kuda Prime Vendor kaavali, client evadaina pimp thappadhu …

  • polimetla
   May 7, 2012 at 3:01 pm

   Thank you Shyam…I will try to run away from Pimps soon….still life is like that…. : (

 5. Mahesh
  May 9, 2012 at 7:11 pm

  adirindi guru ….

 6. February 10, 2014 at 9:19 pm

  exelent once again try next one;

 7. Vbmrao
  August 11, 2016 at 5:28 pm

  Excellent

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: