నా రంగుల ప్రపంచం

నా రంగుల ప్రపంచం


చిన్న పిల్లలను చూడాలనుకున్నా
చిన్ని చిన్ని గౌనులు
జడ రిబ్బనులు
బుడ్డి బుడ్డి నిక్కరులు
నిక్కరుపై మొలతాడులు
బుడి బుడి అడుగులు
అవధులు లేని కేరింతలు

అందమైన ఆడపిల్లలను చూడాలనుకున్నా
మల్లెపూవులు, ముద్దబంతులు,
సూర్యవంకలు, చంద్రవంకలు,
పాపిట బిళ్ళలు, చంప సవరాలు,
నుదుటున బొట్టు, కళ్ళకు కాటుక,
గొలుసులు, అరవంకీలు,
చేతికి గాజులు, గోరింటాకు,
పట్టు పరికిణీలు,
వడ్డాణాలు, జడగంటలు,
మువ్వల పట్టీలు,
అందరూ పెట్టుకోవాలని
ఆనందంగా వుండాలని

అందంగా తయారవ్వాలనుకుంటా
కోరమీసం, నున్నటిగడ్డం
ఖద్దరు చొక్కా, తెల్లని పంచె,
పై కండువా, జేబులో పెన్ను,
కిర్రు చెప్పులు, చేతిలో కర్ర,
గుండెనిండా గాలి పీల్చుకొని,
ధైర్యంగా ముందుకు నడవాలని

తెలుగు రాష్ట్రం వదిలి
ఆంగ్ల దేశం వచ్చాక తెలిసింది,
పిల్లలైనా, పెద్దలైనా,
ఆడైనా, మగైనా,
అందరివి ఒకటే బట్టలు
ఎలిసిపోయిన బులుగు జీన్స్,
నలిగిపోయిన ముతక బనీన్లు,
నా రంగుల ప్రపంచం
నీరసించి పోయింది

నా భార్యతో చెప్పా
ట్రంకు పెట్టెలో బట్టలు
బయటకు తియ్యమని
ఈ ప్రపంచాన్ని రంగులతో నింపెద్దామని

-o-
Bhavani P Polimetla
Atlanta, GA, USA
Date: Jul-28-2009

Advertisements
  1. August 5, 2009 at 1:47 am

    శ్రీ భవానిగారికి, నమస్కారములు.

    కంటికి కనబడని ఒక “తెలుగు మనసుకు” రూపం ఇచ్చి, రంగులద్ది, వెలిసిపోయిన “ఆ ప్రపంచం ” వారికి చూపించాలన్న మీ తపనకు నా జోహారులు! అభినందనీయులు. కవిత అత్యద్భుతంగా వున్నది.

    భవదీయుడు,
    మాధవరావు.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: