పర్యావరణ పరిరక్షణ (బుర్ర కథ)

burrakatha

సోదర భారత పౌరుల్లారా ॥ తందాన తాన ॥
నా తోటి ఆడేటి పిల్లల్లారా ॥ తందాన తాన ॥
వాతావరణం ఏ రకంగా మారుతుందయ్యా అంటే ? ॥ ఏ రకంగా మారుతుంది ? ॥
వానలు వద్దంటే వస్తున్నాయి ॥ అయ్యొయ్యో ॥
ఆపలేని వరదలు వస్తున్నాయి ॥ అయ్యొయ్యో ॥
పంట పొలాలు అన్ని మునుగుతున్నాయి ॥ అయ్యొయ్యో ॥

కథకుడు : ఇంకొక వైపు ఏం జరుగుతుందయ్యా అంటే ? ॥ ఏం జరుగుతుంది ? ॥

నూతిలోని నీళ్ళు ఎండిపోతున్నాయి ॥ అయ్యొయ్యో ॥
చెరువు లోని నీళ్ళు మాయమవుతున్నాయి ॥ అయ్యొయ్యో ॥
భూమి బీటలూ వారిందయ్యా ॥ అయ్యొయ్యో ॥
పచ్చని పంటలు ఎండిపోతున్నాయి ॥ అయ్యొయ్యో ॥
రైతు డొక్కలు మండిపోతున్నాయి ॥ అయ్యొయ్యో ॥
పశువులు అన్ని సచ్చిపోతున్నాయి ॥ అయ్యొయ్యో ॥

వంత : అయ్యొయ్యో దీనికి మార్గమే లేదా?
కథకుడు : వుంది …లేకే …దాని గూర్చే చెపుతున్నా
వంత : చెప్పు చెప్పు మరి

సైకిలు పైన వెళ్ళాలి ॥ భళా భళా ॥
వచ్చే పొగను తగ్గించాలి ॥ భళా భళా ॥
ఫాను స్విచ్చులు ఆపాలి ॥ భళా భళా ॥
పగలు దీపాలు ఆపాలి ॥ భళా భళా ॥
కరంటు పొదుపుగ వాడాలి ॥ భళా భళా ॥
ప్లాస్టిక్కు సంచులు వదిలెయ్యాలి ॥ భళా భళా ॥

మొక్కల పెంపకం సాగాలి ॥ సాగాలి సాగాలి ॥
కాలుష్యాన్ని తగ్గించాలి ॥ తగ్గించాలి తగ్గించాలి ॥
భూమండలాన్ని రక్షించాలి ॥ రక్షించాలి రక్షించాలి ॥

కథకుడు : ప్రతి ఒక్కరు వీటిని పాటిద్దాం అని కోరుకుంటూ కధను ముగిద్దాం

మంగళం మన నదీమ తల్లికి ॥ మంగళం జయ మంగళం ॥
మంగళం మన పుడమి తల్లికి ॥ మంగళం జయ మంగళం ॥
మంగళం మన వృక్ష జాతికి ॥ మంగళం జయ మంగళం ॥
మంగళం మన భరత మాతకు ॥ మంగళం జయ మంగళం ॥
తరికిట ఝo తరిత !

Author: Bhavani P Polimetla, Hyderabad, 11/23/2015
Note: Kids can practice this and play..it will come around 3 minutes.

Other Reference on Burra Katha: http://www.andhrabharati.com/vachana/vyAsamulu/tAnA06_cs_02.html

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: