రాజకీయాలు (కయ్యాలు)

రాజకీయాలు (కయ్యాలు)

ప్రజలు
అమాయకులు, అనామకులు,
స్వార్ధపరులు, నిరాశాజీవులు

తార్పుడు గాడు తెచ్చిన
మెరుపు నగలు
జిలుగు బట్టలు చూసుకొని
వీడే నా మొగుడు, దేవుడు
అని తలచే అమాయకులు

కాళ్ళ క్రింద భూమిని
భూమిలోని గనులను
కనిపించే నీటిని
కనిపించని గాలిని
తాకట్టు పెట్టి
డబ్బులు తెస్తే
అందులోని చిల్లర
అక్కడక్కడ రాల్చే
నాయకులను దేవుళ్ళని
కొలచే అనామకులు

బదిలీ కోసం
లంచం కోసం
అప్పనంగా వచ్చే
ఐదు పైసలు కోసం
ఆశపడే స్వార్ధపరులు

నాయకుల కత్తి బలం ముందు
తమ కలం బలహీనమని
నమ్మే నిరాశాజీవులు

-0-

నాయకులు
తార్పుడు గాళ్ళు, మోసగాళ్ళు,
ఖూనీకోరులు, వూసరవెల్లులు

భూమిని, నీటిని,
ఆకాశాన్ని, స్వాతంత్రాన్ని,
వేరేవాళ్ళకు తార్చేసారు
వచ్చిన డబ్బుతో
ప్రజల కోసమని
కర్మాగారాలు
సొంతంగా స్థాపించారు
లాభాలు కొడుకులకు, మనుమలకు,
కష్టాలు, కడగండ్లు ప్రజలకు

మహాత్మా గాంధీ తో
మదర్ తెరెస్సా తో
వీరికి పోలికలు
రంగులు మార్చే
వూసరవెల్లులు
కళ్ళు లేని కబోది దగ్గర
పైసలు కొట్టే జేబు దొంగలు

బతికి వున్న వాళ్లకు
ఓట్లు పీకేస్తారు
చనిపోయిన వాళ్ళను
అభిమానులుగా చూపిస్తారు
అవునని కాదంటే
అడ్డంగా నరికేస్తారు
ఖూనికోరులను వదిలేస్తారు
తమ క్షమా గుణాన్ని
వుదారంగా చూపిస్తారు

-0-

ప్రసార మాధ్యమాలు

దూరదర్సినిని
వక్ర దర్శిని అనాలనిపిస్తుంది

వున్నది వున్నట్లు చూపరు
ప్రజలకు కావలసింది చెప్పరు
చెప్పిందే చెప్పి
కాలయాపన చేస్తారు

విషయం తెలుసుకోకుండా
విషయం లేకుండా
వార్తలు రాసేస్తారు
వాణిజ్య ప్రకటనలు జోడిస్తారు
డబ్బు తీసుకొని
చనిపోయిన వాళ్ళను
దేవుళ్ళుగా మార్చేస్తారు

ప్రజల కోసం
నాయకులు స్థాపించిన
ఇంద్రజాలపు పెట్టెలు

-0-

మిగిలిన కొద్ది మంది
మంచివాళ్ళు
మనకెందుకులే అని
వుదారంగా వ్యవహరిస్తారు
పీకల మీదకు వచ్చాక
భోరున విలపిస్తారు

నిద్రావస్త, నీరాశావాదం వదిలి
మన పని మనం చేస్తూ పొతే
దేవుడు తనపని తాను చేస్తూ వుంటాడు.

-0-

Sep-10-2009

Advertisements
 1. bala
  September 10, 2009 at 12:27 pm

  tagulukunnavaadi kante taadichettu nayam. Mukkusooteegaa pote mukku pagiledi
  khaayam.

 2. kalpalatika
  September 10, 2009 at 11:46 pm

  chaalabaaga wraasaaru.
  konchem aavesan,marikonchem aavaedana kalagalipi pandinchaaru.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: