రంగు పెన్సిళ్ళు

Colouring Pencils

రంగు పెన్సిళ్ళు

రంగు పెన్సిళ్ళు
నెమలి ఈకలు
ఇంధ్ర ధనస్సు
సంక్రాంతి ముగ్గులు
నా కళ్ళని, నా కలలని
రంగులతో నింపేసాయి

పెన్సిలు ముల్లు విరిగిపోయినప్పుడు
పెన్సిలు అరిగిపోతున్నందుకు బాధ
నెమలి ఈక చిరిగినప్పుడు
నెమలి ఈక పాడైందని బాధ
ఇంధ్ర ధనుస్సు మాయమైనప్పుడు
మళ్ళీ వస్తుందని ఆశ
ఇవే రంగులు, ఆలోచనలు
జీవితంలో తత్వ చింతనకి
అంకురార్పణ చేసాయి

మనసారా నవ్వటం
మరచిపోయినా మనిషి జీవితం
రంగులు పోయిన హరివిల్లవును

కనిపించని రంగుల కోసం
పరితపిస్తున్న హృదయాలెన్నో
రంగు రాళ్ళ లో వెదుక్కుంటున్నారు
రంగు రాళ్ళు ధరిస్తున్నారు
రంగు నీళ్ళు తాగేస్తున్నారు
చివరకి ఏమి చేయాలో తెలియక
రంగు రంగుల బిళ్ళలు మింగేస్తున్నారు

రంగులన్నిటికీ ఆధారం తెలుపని తెలియక
తెల్లని నిజాన్ని తట్టుకోలేక
కళ్ళు మూసుకుంటున్నారు
నల్లని అభద్దాన్ని భరించలేక
కళ్ళు తెరుస్తున్నారు
కళ్ళకు రంగుటద్దాలు పెట్టుకొని
హమ్మయ్య అనుకుంటున్నారు

జీవితంలో రంగులన్నీ
ఇంధ్ర ధనుస్సువలే మాయమవ్వగా
నలుపు తెలుపుల బాటలో
నలుగుతూ నే సాగుతున్నా
చిరునవ్వుల చినుకుల కోసం
ఆనందపు హరివిల్లుల కోసం

-o-
Date: Jul-23-2009
Atlanta, GA, USA

Peacock Feathers

The above two images copied from wikimedia. Thanks to owners for providing them.

http://commons.wikimedia.org/wiki/File:Peacock_feathers.jpg
Advertisements
 1. వల్లూరి సుధాకర్
  July 25, 2009 at 12:40 pm

  “రంగు రాళ్ళు ధరిస్తున్నారు, రంగు నీళ్ళు తాగేస్తున్నారు, చివరకి ఏమి చేయాలో తెలియక రంగు రంగుల బిళ్ళలు మింగేస్తున్నారు” ఇవ్వన్ని పరితపిస్తున్న హృదయాలతో కాదు, జీవితపు దశ-దిశ తెలుసుకోలేని అయోమయంలోపడి చేస్తున్నవి.

 2. KP
  July 25, 2009 at 5:19 pm

  Bhavani,

  Gummadikayala donga ante bujalu tadumukunnatly, nee kavithalu nannu aalochimpachesthunnai.
  Love
  Krishna

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: