తెలంగాణ సోదరా

తెలంగాణ సోదరా
ఉద్యమాలు ఆపరా
తెలంగాణ సోదరా
చరిత్రను మరి చదవరా
నైజాము సర్కొరోడ
నాజీల మించినోడ
అని నువ్వు పాడినావు
నేడేమో సభలలోన
నైజాము చలవంటూ
ఆ నైజాము చలవంటూ
ఎలుగెత్తి చాటినావు

తెలంగాణ సోదరా
తిట్లన్నీ ఆపరా
తెలంగాణ సోదరా
చరిత్రను తిరిగి చూడరా
ఆంద్రోడు అంటావు
వలసవాది అంటావు
పుట్టి పెరిగిన వాడిని
కాదు పోమ్మంటావు
ముంబై నువ్వు పోలేదా
అమెరికాకు రాలేదా
పౌరసత్వం కోసం నువ్వు
ఆ పౌరసత్వం కోసం నువ్వు
అర్జీలు పెట్టలేదా?

తెలంగాణ సోదరా
ఆలోచించి చూడరా
తెలంగాణ సోదరా
ముక్కు నువ్వు తుడవరా
ముక్కు కారుతుంటేను
ముక్కే కోసేస్తనంటావ్
ముఖాన్ని తిట్టిపోస్తే
ముక్కుకు నయమై పోద్దా?
దేశమంతా కుళ్ళి పోయె
ఆ దేశమంతా కుళ్ళి పోయె
దేహమంతా రోగ మాయె

తెలంగాణ సోదరా
తిట్లు నువ్వు ఆపరా
తెలంగాణ సోదరా
వేలు ఎత్తి చూపరా
60 ఏళ్ల ఉద్యమంలో
ఎవరు నిన్ను దోచినారు
నాటి నైజాము నుంచి
నేడున్న నాయకులు
ఉత్త చేతులూపుకుంటూ
డబ్బులన్ని గుంజినారు
ఉద్యమం పేరు చెప్పి
ఆ ఉద్యమం పేరు చెప్పి
కుచ్చు టోపీ పెట్టినారు

తెలంగాణ సోదరా
నువ్వు రెచ్చి పోకురా
తెలంగాణ సోదరా
నువ్వు చావమాకురా
ప్రపంచ చరిత్రలోన
సచ్చి సాధించినదెవడు?
నీ శవం పై పప్పు బెల్లం తిని
నాయకులు బలుస్తుండ్రు
ఏడ్చి ఏడ్చి అమ్మ నాన్న
ఆ ఏడ్చి ఏడ్చి అమ్మ నాన్న
కళ్ళన్నీ ఎర్రబారె

తెలంగాణ సోదరా
నువ్వు బాగ చదువరా
తెలంగాణ సోదరా
నైపుణ్యం పెంచరా
మైక్రోసాఫ్ట్ CEO
సత్య అయినాడంట
భయపెడితే వచ్చిందా?
అడుక్కుంటే ఇచ్చిండ్ర?
కష్ట పడి పని చేస్తూ
పదిమందితో బాగుంటూ
పై పై కి పోవాల
ఆ పై పై కి పోవాల
మంచి పేరు తేవాల

తెలంగాణ సోదరా
ఆలోచించి చూడరా
తెలంగాణ సోదరా
అలుక నువ్వు మానరా
సమస్య పై పోరాడు
మనుషుల పై కాదురా

చెప్పేకి ఎవడంటూ
నాపైకి ఎగుర మాకు
ఖమ్మంలో పుట్టినాను
గోదాట్లో పెరిగినాను
పొట్ట చేత పట్టుకొని
ఊరూరు తిరిగినాను
తెలుగోళ్ళు వెధవలంటూ
తిట్టీ పోసేస్తున్నారు

సమస్యేంటో చెప్పరా
పరిష్కారం వెదుకు దాము
తెలంగాణ సోదరా
ఆలోచించి చూడరా
తెలంగాణ సోదరా
అలుక నువ్వు మానరా

-o-
Bhavani P Polimetla
02-23-2014

Advertisements
  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: