తెలుగు భాషా ద్రోహులకు విన్నపం

అమ్మ దగ్గిర ముద్దలు మింగి
నాన్న దగ్గిర చదువులు నేర్చి
దొడ్డగ చదివి, దేశం పోయి
తెలుగు భాషను తిట్టగ వచ్చిన
ద్రోహుల్లారా రారండి

తెలుగు భాషతో లాభం ఏమని
తరాజు బేరం వదలండి
కళ్ళు మూసిన బేహారులకు
తెలుగు వజ్రమని ఎలా తెలుయును?

అన్నమాచార్య కీర్తనలు
రామదాసు కీర్తనలు
సంతోషంగా పాడుకోవచ్చు
వేమన పద్యాలు
చక్కగా చదువవచ్చు
కూచిపూడి నౄత్యం
కన్నులార చూడవచ్చు

తెలుగు పాటలు వినండి
తెలుగు భాషలో మాట్లాడండి
తెలుగు లోనె మరి రాయండి
గొంతు దాటి మాట పెగలక పోతే
వైద్యుడి కొకపరి చూపండి

పరాయి దేశం పోయి వచ్చిన
మనుషుల్లారా రారండి
వస్తూ వస్తూ పరాయి భాషను
సరిహద్దులలో వదలండి

తెలుగు భాషను తిట్టగ వస్తే
దారిన పోయే కుక్క ఒక్కటి
బౌ బౌ అందని వదిలేస్తాం

తెలుగు భాషను తిట్టగ వస్తే
బూతలన్నింటిని కలియగ తిప్పి
కరిగించీ మీ చెవులో పోస్తాం

తెలుగు భాషను తిట్టగ వస్తే
మాలో ఒక్కడు చచ్చినాడని
పిండం పెట్టి కాకులకేస్తాం

ప్రపంచమంతా ఆగిపోయినా
తెలుగు భాషకూ ఢోకా లేదు
మీరు ఒక్కరు భాషను తిడితే
భాషకు వచ్చిన నష్టం లేదు
తెలుగు భాషలో తీయగ పలికిన
స్నేహ హస్తం మీ కందిస్తాం

-0-
తెలుగు గెడ్డపై
తెలుగు తల్లికీ
తెలుగు తండ్రికీ
తెలుగు వాడిగా పుట్టి
“తెలుగు is useless language”
అని తిట్టిన వాళ్ళకి
ఈ కవిత అంకితం

-0-
భవాని
Mar-12-2009, Atlanta, USA

Advertisements
 1. March 31, 2009 at 11:12 pm

  తెలుగు భాషలో మాట్లాడండి
  తెలుగు లోనె మరి రాయండి
  ఈ మీ కవిత లోని భావాన్ని ఆచరణలో పెట్టడానికే మీరు వ్రాశారా.. లేదా కవిత కవిత లాగే మిగిలిపోవాలని వ్రాశారో అర్థం కావటంలేదు..ఎందుకంటే ముందు మీ బ్లాగును పూర్తిగా తెలుగు మయం చేయండి. ఆ తర్వాతే ఈ కవితకు విలువ ఉంటుంది. మీ బ్లాగులో కేటగిరీస్ లోని లేబుల్స్ ను గమనించండి. మీకే అర్థం అవుతుంది. ఇంకొక విషయం, మీరు తెలుగు ను తిట్టే వాళ్లకి అని చెప్పారు కదా. తెలుగును నాకు తెలిసి ఏ తెలుగు ప్రజలూ తిట్టరు. తెలుగు ను వ్రాయండి అని ఫోర్స్ చేసినపుడు వారి వారి ఫీల్డ్స్ లో తెలుగును ఫ్లెక్సిబుల్ చేయలేక తెలుగు లో వ్రాసిండిక పోవచ్చు. ఒక వేళ మీరు అన్నీ తెలుగు లోనే ఉండాలి అని కృషి చేసేవారయితే html, css, java code లను కూడా తెలుగులో కనిపెట్టండి. ఎందుకంటే అపుడు మనకు ఇంగ్లీష్ తో పనిలేదు. ఇంటర్నెట్ లో కూడా పూర్తి తెలుగులో నే వ్రాయొచ్చు. అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ , సాఫ్ట్వేర్స్ చైనా, మరియు జపాన్ భాషలలో దొరుకుతున్నట్లు తెలుగు లో కూడా దొరకడానికి మీ వంతు కృషి మీరు చేయడానికి ట్రై చేయండి. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం. ఆవేశంలో తిడ్తూ కవితలు వ్రాసే సమయాన్ని, తెలుగు భాష ను అన్నీ చోట్ల ఉపయోగించడానికి కావలసిన సదుపాయాలను క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని మీరు పాజిటివ్ గా ఆలోచించి సలహాలాగా తీస్కుంటారో, నెగెటివ్ గా ఆలోచించి సెటైర్ లాగా తీస్కుంటారో అనేది మీ ఇష్టం, థాంక్యూ

  • Revathi
   April 18, 2012 at 2:32 am

   well said

  • venkat
   March 23, 2016 at 6:09 am

   good reply

 2. వెంకట్
  April 1, 2009 at 3:25 am

  శభాష్ భవాని గారు. మీ కవిత చాలా బావుంది.

 3. durgeswara
  April 1, 2009 at 8:47 am

  chaalaa baagaavraasaavammaa

 4. April 3, 2009 at 6:57 am

  భవాని గారు మీ ” తెలుగు భాషా ద్రోహులకు విన్నపం”
  కవిత చదివానండి….
  చాలా …చాలా ….బాగుంది….
  చదివాకా మనసు ఉండబట్ట లేక ఈ టఫా పంపిస్తున్నాను
  ….మీ శైలి …బాగుంది…

  కవితలో ప్రతీకాత్మక వాదం …బాగుంది…
  విదేశాలకు వెల్లే …ప్రతి భారతీయునికి …
  ఈ కవిత చెంపపెట్టు…ఇలాగే మీరు ఇలాగే కవిత లు వ్రాయాలని కోరుకుంటూ…
  మీ నరేశ్ కుమార్ తూర్పింటి ఆర్.జి.యు.కె.టి లో మెంటర్

 5. sundararamireddy
  April 3, 2009 at 9:51 pm

  kavitha chala baagundandi, oka pakka telugu bhasha madhuryaani , goppadanaanni vivaristune, bhasha drohulanu baga vimarsinchaaru, mee saili nachindandi

 6. April 5, 2009 at 9:37 pm

  meedi dharmaagraham. meeku naa hrudayapurvaka dhanyavaadamulu. maro rudramadevi avataaram chusaanu mee kavitalo. dhanyavaadamulu maromaaru.

 7. Satish Reddy
  May 9, 2009 at 7:52 am

  hey, this is too good..

  this reminds me of something.. naku ATA ki TANA ki vellinappudalla navvu vastadi.. akkada jarigedi telugu maha sabhalu, but prati okkaru potilu padi maree english matladutharu speech lu itchetappudu.. adhi ento naku artham kadhu..

  Inko funny thing enti ante.. english lo tappulu matladithe vadu waste fellow uneducated fellow palleturu vadu.. hindi tappu matladithey vadu antha dynamic persona kadhu antha fast person kadhu.. but telugu tappulu tappulu matladithey matram vadu/adhi chala cute.. vine vallu chuse vallu kuda full murisipotharu.. as if vadu/adhi telugu matladatame goppa annattu.. I never understand this concept

 8. jhon reddy
  May 14, 2009 at 12:32 am

  భవానికి గారు మీ కవిత బాగలేదని చెప్పను.అయితే రెండు విషయాలు చెప్పదలచు కొన్నాను.

  మొదటి ఫాయింట్, విదేశాలకి వెళ్ళినవాళ్ళు తెలుగు మర్చి పోతున్నారు లేదా తెలుగును కించ పరుస్తున్నారు అనేదాన్ని నేను కచ్ఛితంగా వ్యతిరేకిస్తాను.

  అమెరికా నుంచి “మా బడి” యనే పాఠశాల ప్రొగ్రాం ద్వారా చాల మంది చాలా మంది పిల్లలు తెలుగు నేర్చుకొని చక్కగా వేమన పద్యాలు,నీతి శతకం పద్యాలు చదివి, చెప్పగలుగుతున్నారు.

  అమెరికా నుంచి మంచి సాహిత్యం నింపుకొన్న వెబ్ మ్యాగజైన్ వస్తున్నాయి. ఊదా: కౌముది, సుజనరంజని, ఈ మాట.

  ఎన్నో తెలుగు సంస్థలు చాలా తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఊదా: తానా, ఆట, బాట, సిలికానాంధ్ర.

  సిలికానాంధ్ర వారు కూచిపూడి నృత్య కార్యక్రమం ద్వారా, మరియు అన్నమయ్య లక్ష గళార్చన ద్వారా తెలుగువారికి, రెండు గిన్నిసు బుక్కు అవార్డులు తీసుకొచ్చారు. ఇలాంటి కవితలు వారిని అలాంటి వారిని బాధించవా.

  మరి ఆంధ్రప్రదేశ్ లో మన ప్రజలుగాని ప్రభుత్వాలు ఇలాంటి చేయగలిగాయా?

  నా రెండవ ఫాయింట్, మీరు విదేశంలో వున్న వారి గురించి విమర్శించే ముందు మన దేశం ఏమి జరుగుతుందో చూడండి.

  హైదరాబాదు పది శాతం కూడ స్కూలో తెలుగు చదవడం లేదు. ఒకా బోర్డు కూడ తెలుగులో కనబడదు.

  పది యేళ్ళ క్రితం, గృహాలకు, లేదా షాపింగ్ కాంప్లెక్స్ కు ” బృందావనం, ద్వారాకానిలయం” అని పేర్లు పెట్టెవారు.

  ఇపుఢు “వెస్ట్ ల్యాండ్ మెడొస్”, “లారెల్ విల్లాస్” అయిపోయాయి.

  మరి వీరంతా మంచివారా?

  నా ఫాయింట్ ఏమిటంటే, తెలుగు ప్రేమించే వాళ్ళూ ఏ దేశంలో వున్నా వారు వారికి తగిన చేస్తు వుంటారు. ద్వేషించే వాళ్ళు ఏ దేశంలో వున్నా ద్వేషిస్తూ వుంటారు.

  కావున విదేశాలలో వున్న వాళ్ళనె విమర్శించఢం సబబు కాదేమోనని నాభావన.

  మీరు అమెరికాలోనె వుంటున్నారు మరి మీకు తెలియనదేమి కాదు.

 9. polimetla
  May 14, 2009 at 5:17 am

  నమస్తే,

  ఈ కవిత రాసింది “తెలుగు is useless language” అని అన్నవాళ్ళకు.
  వాళ్ళు భూమిమీద ఎక్కడ వున్నాసరే.

  ధన్యవాదములు,
  భవాని

 10. madhavaraopabbaraju
  June 18, 2009 at 5:00 am

  భవాని గరికి, నమస్కారములు.
  మీ కవిత బాగుంది, కొంత ఘటుగా కూడా వున్నది.ఏదిఏమైనా, తెలుగు భాషపై మీ కున్న అభిమానానికి, ప్రేమకు నా జోహారులు.
  తెలుగు భాషపై నాకు గల అభిమానాన్ని ఒక నా కవితలో తెలియజేసాను.ఆలకించండి:
  రాధమాధవ్-గద్య కవితలు

  ” కవి శిల్పం ”

  అశేష జన/
  సముద్రం పోటెత్తు తున్నది
  శిల్పారామానికి
  అచట
  ఓ శిల్పం
  మాటలాడుతున్నదట!!
  చంద్రుని కళలన్నిటిని
  నింపినట్లు
  అతి సుందరంగా వున్నదట ఆ శిల్పం;
  ఇలలో
  అలనాటి
  తెలుగు కవుల నుండి
  ఈ నాటి
  కవుల వరకు
  అందరి కవితలను
  అడిగిన వారందరకు
  మృదు మధురంగా వినిపిస్తున్నది
  ఆ శిల్పం;
  ఆ శిల్పిని
  చూడాలన్నారు అశేష జనం
  మబ్బుల చాటునుండి వచ్చిన
  పూర్ణ చంద్రుడులాగా
  వున్నాడు ఆ యువ శిల్పి
  ఆయనెవరో కాదు
  మహ కవి
  తెలుగువారి ముద్దు బిడ్డ;
  ఈ శిల్పానికి
  కవితలను ఎందుకు నేర్పించారు?
  అశేష జనాంధ్రులు అడిగారు
  శాశ్వతమైన శాసనాలు చేసి, శాసించే
  శాసన కర్తలు
  తెలుగు భాషకు
  ప్రాచీన హోదా
  కల్పించవచ్చు, లేదా మరువవచ్చు
  తెలుగు కవినైన నేను
  రేపు వుండవచ్చు, లేదా వుండక పోవచ్చు;
  యుగయుగాల చరిత్రను చెప్పే
  ఈ రాతి/శిల్పం
  రేపటి యుగాల వారికి కూడా
  ప్రాచీన తెలుగు పాటవాన్ని
  తెలుపుతూ వుండాలన్నదే
  నా ప్రగాఢ ఆశ
  అందుకే ఈ
  “కవి శిల్పం”.

 11. June 24, 2009 at 10:41 pm

  మమ్మీ డాడీ అని పిలిపించుకునే తెలుగు మాతా పితలు తెలుగునేమి ఉద్ధరిస్తారయ్యా ?
  మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని ఇంగ్లీషులో వ్రాసుకుని పాడే పిల్లల
  తల్లి దండ్రులయ్యా వీరు
  డాలర్ల కోసం పరుగెత్తిన పుత్రసంతానాన్ని తల్చుకుని గర్వించే జీవులయ్యా వీరు
  ఈ తెలుగు సాయంత్రం తేవాలి తెలుగు భాషా ప్రపంచానికి మరో ఉదయం!

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: